మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 25:
బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.నేతలు మాట్లాడుతూ..ఈ నిధుల మంజూరు ద్వారా బిచ్కుంద పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి వంటి మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద టౌన్ మున్సిపల్ చైర్మన్ సాహిల్ సెట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసద్ అలీ, గోపాల్ రెడ్డి, నాగనాథ్ పటేల్, యోగేష్ గుప్తా, ధర్పల్లి సంజు తదితరులు పాల్గొన్నారు.