
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22:
పిట్లం మండల కేంద్రంలో ఏడవ,నాలుగవ అంగన్వాడి కేంద్రాల్లో ఈ ఏడాది పోషకాహార మాసోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం చిన్నపిల్లల సక్రమమైన పోషణ,ఆరోగ్య పరిరక్షణపై కుటుంబ సభ్యులలో అవగాహన పెంపొందించడం అని సిడిపిఓ సౌభాగ్య తెలిపారు.ఈ సందర్భంగా పూర్వప్రాథమిక విద్యా కార్యక్రమాల నేపథ్యంలో సున్నా నుండి మూడు సంవత్సరాల చిన్నపిల్లల పోషకాహారం,ఆరంభ అభివృద్ధి, ప్రేరణ కలిగించే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.సిడిపిఓ సౌభాగ్య మాట్లాడుతూ -పిల్లల పోషణలో తల్లి పాల ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తగిన సమయానికి తల్లి పాలను అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మేధో వికాసం సక్రమంగా జరుగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సుమలత,అంగన్వాడి టీచర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

