• పెరమన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీ, శ్రీనివాసులు కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
  • బాధిత కుటుంబాల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

కొవ్వూరు సెప్టెంబర్ 18:(మన ద్యాస న్యూస్ ):///

సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుమంది మృతి చెందిన సంఘటన జిల్లాలో విషాదం నింపిన విషయం తెలిసిందే. మృతుల్లో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట అరుంధతివాడకు చెందిన చల్లగుండ్ల లక్ష్మీ, శ్రీనివాసులు దంపతులు ఉన్నారు. తక్షణమే స్పందించిన ప్రశాంతమ్మ.. ఈ విషయాన్ని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. మానవతాదృక్పథంతో స్పందించిన సీఎం చంద్రబాబు.. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు కూడా స్వయంగా ఫోన్ చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఇందుకూరుపేట చల్లగుండ్ల లక్ష్మీ శ్రీనివాసులు కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed