వింజమూరు :సెప్టెంబర్ 18: (మన ద్యాస న్యూస్ ) ://
ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సమస్యల పరిష్కరించకుండా హామీలు అమలు చేయడం లేదని యుటీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక వింజమూరు పంచాయతీ బస్టాండ్ వద్ద యుటీ ఎఫ్ రణభేరి ప్రచార జాతకు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న PRC IR DA ఇంతవరకు ప్రకటించలేదు అన్నారు. ప్రభుత్వం వెంటనేస్పందించకపోతే సెప్టెంబర్ 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం కచ్చితంగా నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శేషులు, చలపతి శర్మ, వెంకటేశ్వర్లు, ఖాజావలి, బాలరాగయ్య, చెంచలబాబు మరియు మండల నాయకులు వెంకటేశ్వర రెడ్డి, వీరాంజనేయులు, పరమేశ్వరరావు భారీగా కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.