

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 7 :నెల్లూరు నగరం రామలింగాపురంలో అమ్మ హాస్పిటల్ ఐవిఎఫ్ సెంటర్ ను ఆదివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించినారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ,ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఏపీ వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, సివి శేషారెడ్డి, బిజెపి నాయకులు వాకాటి నారాయణరెడ్డి ,ఆంజనేయ రెడ్డి వివిధ పార్టీల నాయకులు ,వైద్య నిపుణులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ ఇన్ ఫెర్టిలిటీ వైద్య నిపుణులు డాక్టర్ బి.దివ్యశ్రీ మాట్లాడుతూ……. తమ ఆసుపత్రి లో సాధారణ కానుపులకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు .లక్రోస్కోపిక్ చికిత్సలు, పిల్లలు లేని వారి కోసం ఐ యు ఐ, ఐ వి ఎఫ్ వంటి చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ టి .కేదార్నాథ్ రెడ్డి మాట్లాడుతూ………. చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నామని తెలియజేశారు. ప్రత్యేక డైట్ తో పాటు, యోగ కౌన్సిలింగ్, ఎన్ ఐ సి యు వంటి సేవలు కూడా అందిస్తున్నామని వివరించారు.






