జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల

మన న్యూస్ ,నెల్లూరు: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం విడుదలయ్యారు.ఈ సందర్భంగా జైలు వద్ద వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మెరీగ మురళీధర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి , సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ కిలివేటి సంజీవయ్య ,మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలికారు.కూటమి ప్రభుత్వం గోవర్ధన్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసుల్లలో చివరికి న్యాయమే గెలిచిందని పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ.. సంబరాలు జరుపుకున్నారు.తమ అభిమాన నాయకుడు గోవర్ధన్ రెడ్డి తో కరచాలనం చేసేందుకు దారి పొడువునా వేలాదిమంది కార్యకర్తలు పోటీపడ్డారు.వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తాకిడితో బుజ బుజ్జ నెల్లూరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది.కాకాణి గోవర్ధన్ రెడ్డికి అడుగడుగునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జననీరాజనం పలికారు. జిల్లా కేంద్రగారం నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ………..నాకున్న ఆస్తి ప్రజలు అభిమానం అని అన్నారు.జిల్లా కేంద్ర కారాగారం లో అందరూ వైసీపీ వారే,జైలు అంటే భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.చంద్రబాబు నాయుడు దయవల్ల జైల్లో వైసిపి వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది అని అన్నారు.హైకోర్టు బెయిలు మంజూరు చేసిన తర్వాతా కూడా ఉద్దేశపూర్వకంగానే విడుదల ఆలస్యం చేశారు అని తెలిపారు.నాకోసం నిన్న సాయంత్రం ప్రజలు వచ్చారు, ఈరోజు ఉదయం కూడా వచ్చారు ప్రజల అభిమానం మర్చిపోలేనిది అని అన్నారు.నెల్లూరు జిల్లా లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ,మంత్రిగా పని చేసిన వ్యక్తి నీ ఇన్ని రోజులు జైల్లో ఉంచడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు.6 కేసులు సోషల్ మీడియా కేసులు పెట్టారు అని తెలిపారు. ఓట్లు వేస్తే లిక్కర్ ఇస్తా అని నేను చెప్పానని హాస్యాస్పదంగా లిక్కర్ కేసులను నమోదు చేశారు అని అన్నారు.జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదు నేను ఆరోగ్యంగానే ఉన్న మానసికంగా ధైర్యంగా ఉన్న అని అన్నారు.సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,సోమిరెడ్డి కొడుకు చేసే తప్పులను కచ్చితంగా ఎత్తిచూపుతాను అని అన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు