

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో.. వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ళ కిషన్,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి 4వ డివిజన్ వైసిపి ఇన్చార్జ్ షేక్ సందాని పాత్రికేయ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా చీదెళ్ళ కిషన్ మాట్లాడుతూ……. నిన్నటి రోజున మా నాయకులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వి. ఆర్ మున్సిపల్ స్కూల్ గురించి వాస్తవాలు మాట్లాడితే వాటికి సమాధానం చెప్పలేక.. ఈరోజు టిడిపి నేత, రూప్ కుమార్ యాదవ్ డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.ముఖ్యంగా వి.ఆర్ స్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియ సరైన విధానంలో జరగలేదని.. కేవలం టిడిపి నేతలు సిఫారసు చేసిన వారికే వి .ఆర్ సి లో సీట్లు కేటాయించిన మాట వాస్తవం కాదా.. రూప్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పాలన్నారు.ఈ అడ్మిషన్ల ప్రక్రియ పై మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు మాట్లాడితే ఈరోజు రూప్ కుమార్ యాదవ్ దానిపై అవాకులు చవాకులు పేలుతున్నాడని అన్నారు.రూప్ కుమార్ యాదవ్ ఈరోజు మీరు చెబుతున్నారే నారాయణ టీమ్ ద్వారా పేదలను గుర్తించి కేవలం పేద పిల్లలకే వి .ఆర్ మున్సిపల్ స్కూల్లో సీట్లు ఇచ్చామని చెప్పడం పూర్తిగా అవాస్తవం. అసలు పేద పిల్లలను గుర్తించడానికి N టిమ్ కు ఎలాంటి చట్టబద్ధత ఉంది.పేద పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కేటాయించాలంటే విద్యాశాఖ అధికారులు డిఇఓ,ఎంఈఓ ఆ పాఠశాల హెచ్ఎం అధికారులు సర్వే నిర్వహించి ఉండాల్సింది.వి ఆర్ మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియనుఆ స్కూల్ వారే అప్లికేషన్లు ఇచ్చి తిరిగి వారే వాటిని స్వీకరించి ఉంటే అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా జరుగుండేదని. ఇలా చేయడం పద్ధతి కాదని మాత్రమే మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.టిడిపి కార్యకర్తల పిల్లలకే సీట్లు కేటాయించారని మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి చెబుతుంటే మీకు పట్టున్న డివిజన్లో సీట్లు ఇచ్చామని చెప్పడం సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణిలో మాట్లాడడమేనన్నారు. వి ఆర్ మున్సిపల్ స్కూల్ కి నారాయణ వారు అందజేసిన మెటీరియల్స్ లో వారి కళాశాలల ర్యాంకులు, ఫోటోలు ప్రచురించి ఇవ్వడం సరి కాదని ఇవ్వదలచిన వారు వెంకటగిరి రాజా వారి చరిత్రను ఆ పుస్తకాలపై ప్రచురించి ఇస్తే అది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని చెప్పారని అన్నారు. స్కూల్ బస్సులకు 5 కోట్ల రూపాయలు, స్నాక్స్కు 5 కోట్ల రూపాయలు.. మున్సిపల్ శాఖ నుంచి విత్ డ్రా చేసుకొని అప్పనంగా మంత్రి నారాయణ దోచుకున్నారని మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నిస్తే దానికి మీ నుంచి సమాధానం లేదు.ఈరోజు రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టిన విధానం చూస్తుంటే కూటమి ప్రభుత్వ అసలు సిసలైన డైవర్షన్ పాలిటిక్స్ ఇది కదా అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్నారు.వి ఆర్ సి స్కూలు ప్రారంభం రోజునే మంత్రి లోకేష్ ముందు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వి ఆర్ స్కూల్ మునిసిపల్ స్కూల్ గా ఏ విధంగా మారిందోతనకు అర్థం కావడం లేదని చెప్పిన దానికి ఈరోజుటి వరకు సమాధానం లేదు.మీరు ఒక్క స్కూల్ ను అభివృద్ధి చేసి ఇలా చెప్పుకుంటున్నారే గత వైసిపి ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి ఆ స్కూల్లకు కార్పొరేట్ స్థాయి వసతులు తీసుకురావడం జరిగిందన్నారు. మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగత.. విమర్శలు చేసే వారు కాదని ఆధారాలు ఉంటేనే వాటి గురించి కచ్చితంగా మాట్లాడతారని అది రూప్ కుమార్ యాదవ్ తెలుసుకోవాలన్నారు.రూపు కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి మూడు సంవత్సరాలే అని పదేపదే చెప్పడం రూప్ కుమార్ యాదవ్ అవివేకమేనన్నారు చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్లయిన వచ్చిన మొదటిసారి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొంది చరిత్ర తిరగ రాశారన్న విషయాన్ని రూప్ కుమార్ యాదవ్ గుర్తుంచుకోవాలన్నారు.చంద్రశేఖర్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వం కలిగిన వారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ అబ్జర్వర్ గా, అలాగే నెల్లూరు సిటీ అబ్జర్వర్ గా, అలాగే వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా, అలాగే వైఎస్ఆర్సిపి టీచర్స్ విభాగం అధ్యక్షులుగా, నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ గా, ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా..ఇలా ఎన్నో పదవులు అప్పగిస్తే.. వాటన్నింటినీ బాధ్యతాయుతంగా.. నిర్వహించారని తెలిపారు. ఇకనైనా రూప్ కుమార్ యాదవ్.. చంద్రశేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా ప్రెస్ మీట్ పెడితే బాగుండేదని హితవు పలికారు. తర్వాత విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ…..మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వి ఆర్ మున్సిపల్ స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనుల గురించి ప్రస్తావిస్తే.. ఈరోజు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ దానికి సమాధానం చెప్పలేక.. ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి అడిగిన ఒక్క ప్రశ్న కైనా మీ దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలకు ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతారని అన్నారు. ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్ కు నారాయణ ఇచ్చిన నోటు పుస్తకాల గురించి ఎవరు తప్పు పట్టడం లేదని అందులో.. వారి విద్యాసంస్థలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడం సరికాదని మాత్రమే చంద్రశేఖర్ రెడ్డి చెప్పారని అన్నారు.స్పాన్సెడ్ బై నారాయణ అని వేసుకొని ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదన్నారు.వి ఆర్ మున్సిపల్ స్కూల్లో పిల్లలకు ఇస్తున్న పుస్తకాల్లో వెంకటగిరి రాజావారి చరిత్ర ఉంటే బాగుండేదని.. మాత్రమే చంద్రశేఖర్ రెడ్డి చెప్పారని అన్నారు.మున్సిపల్ స్కూల్లో పేద పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ..N టీమ్ ద్వారా.. సర్వే చేయడం.. సరికాదని ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు.ఎన్ టీం ద్వారా సర్వే చేయించి కేవలం టిడిపి కార్యకర్తల పిల్లలకే.. వి ఆర్ మున్సిపల్ స్కూల్లో సీట్లు కేటాయించుకున్నారన్నది.. వాస్తవం కాదా అన్నది రూప్ కుమార్ యాదవ్ చెప్పాలన్నారు.నిజాలు దాటిపెట్టి .. ఈరోజు రూప్ కుమార్ యాదవ్.. అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. పదే పదే చంద్రశేఖర్ రెడ్డి ని మీరు రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్లే మీకేం తెలుసు అని రూప్ కుమార్ యాదవ్ విమర్శిస్తుండడం.. సిగ్గుచేటు అన్నారు.సమర్థత ఉన్న నాయకులు కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి.. ఎన్నో పదవులు అప్పగిస్తే వాటిని దిగ్విజయంగా.. నిర్వహించారని తెలిపారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ గా, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. నాలుగో డివిజన్ ఇంచార్జ్ షేక్ సంధాని మాట్లాడుతూ……రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు.. ఎంతో బాధ కలిగించాయి అని అన్నారు.చంద్రశేఖర్ రెడ్డి కి రాజకీయ అనుభవం తక్కువేమో గాని.. విద్య సంస్కరణల పట్ల.. ఎంతో ముందు చూపు.. ఉన్న నాయకుడు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అన్నారు.ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్లో టిడిపి వారి పిల్లలకే సీట్లు కేటాయించారని.. చంద్రశేఖర్ రెడ్డి వాస్తవాలతో సహా నిరూపిస్తే.. దానికి రూప్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పలేకపోయారన్నారు. నా ముందే మా డివిజన్ లో టిడిపి నేత.. వారి కార్యకర్తలకి విఆర్సి స్కూల్లో అడ్మిషన్ల కోసం.. అప్లికేషన్లు స్వీకరించడం.. నేను చూశాను అన్నారు.రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ లో.. ఆ డివిజన్ కి ఇచ్చాము… ఈ డివిజన్ కి ఇచ్చాము.. ఆ డివిజన్లు అన్ని వైఎస్ఆర్ సీపీకి పట్టున్న డివిజన్లని చెప్పడం సమాధానం దాటవేసే ధోరణి అన్నారు. నెల్లూరులో ఏ డివిజన్లో సీట్లు కేటాయించిన అది టిడిపి కార్యకర్తల పిల్లలకు మాత్రమే వి ఆర్ మున్సిపల్ స్కూల్లో సీట్లు కేటాయించారని అన్నారు.రూప్ కుమార్ యాదవ్ ఈ విషయంపై అవగాహనతో ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేదన్నారు.
