• వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్):- వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 23న కాకినాడలో జరగునున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి యువజన విభాగం, విద్యార్థి విభాగ నాయకులు అందరూ సమన్వయం చేసుకొని కాకినాడలో జరిగే యువత పోరు కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ భృతిని విస్మరించిందని దానిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకి నిరుద్యోగ భృతి 3 వేలు ఇస్తామన్న హామీ కొండెక్కిందని విమర్శించారు. ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *