పోరుమామిళ్ల, జూన్ 21 (మన న్యూస్):
విద్యార్థి దశలో క్రమశిక్షణతో విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని సీఐడీ అధికారి శ్రీనివాసులు స్పష్టం చేశారు. పోరుమామిళ్లలోని కస్తూరిబా గాంధీ బాలికల వసతి పాఠశాలను శుక్రవారం సందర్శించిన ఆయన, విద్యార్థుల కోసం అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన సైబర్ క్రైమ్‌లు, ఇవ్టీజింగ్, బాల్య వివాహాలు, అత్యవసర ఫోన్ నంబర్లు (Dial 100, 112, 1098), POCSO చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. బాలికలు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా తమ భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.








