గూడూరులో ఘనంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

గూడూరులో ఘనంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలుమన న్యూస్, గూడూరు, జూన్ 3:గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిo సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యులు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ సోమిశెట్టి చెంచు రామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కేరళ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొని ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ …నా గెలుపుకు ఆర్యవైశ్యులు ఎంతో సహకారం అందించారని వారి రుణం తీర్చుకోలేనిది అని అన్నారు. ఆర్యవైశ్య నాయకులు పెద్దలు మా చెంచురామన్నకి త్వరలో మంచి పదవి వస్తుందని ఆర్యవైశ్యులకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం పాశం సునీల్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారని మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి సాయి కృష్ణ , కొండ భాస్కర్ , వెంకటసుబ్బయ్య, గోపాల్, ఎస్. ఎల్. ఎన్ బాబు ,కోట రామారావు, సురేష్ ,బయ్యా మోహన్ రావు ,గిరిబాబు ,తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి