మన న్యూస్ ,గూడూరు:దేవుని దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి.. పేద ప్రజలకు ఆయన సేవలు నిరంతరం కొనసాగాలి అని దువ్వూరు అజిత్ కుమార్ అన్నారు. గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాకాడు మండలం టిడిపి మాజీ అధ్యక్షుడు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి. దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గూడూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ కేకును ఎమ్మెల్యే చే కట్ చేయించి తన అభిమానాన్ని తెలియపరిచిన అజిత్ రెడ్డి. అజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూదేవుని దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి.. పేద ప్రజలకు ఆయన సేవలు నిరంతరం కొనసాగాలన్నారు.అజిత్ రెడ్డి తో పాటు నిడుగుర్తి సర్పంచ్ మల్లాపు నాగరాజు, టిడిపి నాయకులు రవి రెడ్డి, రమేష్, ప్రదీప్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *