

మన న్యూస్, నెల్లూరు, మే 18:నెల్లూరు కిసాన్ నగర్ లో ఆదివారం వైఎస్ఆర్సిపి 3 వ డివిజన్ ఇన్ చార్జ్ ప్రకటన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు కార్యకర్తలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కి బ్రహ్మరథం పట్టారు .అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న.. సేవలను పలువురు నాయకులు ప్రజలకు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మూడో డివిజన్ వైసిపి ఇన్చార్జిగా అక్కేలరెడ్డి నారాయణ రెడ్డి ని ప్రకటించారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజలకు ఏలాంటి సమస్య ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అధిష్టానం ఆదేశాల మేరకు పోరాటం చేస్తామని తెలిపారు. డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి.. పార్టీ బలోపేతం లక్ష్యంగాపనిచేస్తానన్నారు.పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ….. 3 వ డివిజన్ ఆత్మీయ సమావేశానికి విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పండుగ వాతావరణం లో.. వేల మంది కార్యకర్తల ఉత్సాహం నడుమ.. వైఎస్ఆర్సిపి మూడో డివిజన్ ఇంచార్జ్ అక్కేలరెడ్డి నారాయణ రెడ్డి ఆత్మీయ అభినందన సభ జరగడం ఎంతో సంతోషకరమన్నారు. డివిజన్ ప్రజల, అభీష్టం మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో డివిజన్ ఇన్చార్జిగా అక్కేలరెడ్డి నారాయణ రెడ్డిని ప్రకటించడం జరిగిందన్నారు. ప్రజల అభిమానం, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్న విషయం అర్థమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే.. తెలుగుదేశం పార్టీని ప్రజలు చీకొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు మోసపు హామీలు గుప్పించి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఈరోజు హామీలు అమలు చేయలేక.. ప్రజలే ఆ పార్టీని అసహ్యించుకునే పరిస్థితికి వచ్చిందన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని.. మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు.ఈరోజు పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు.. సముచిత స్థానం కల్పిస్తామని.. ఇది జగన్మోహన్ రెడ్డి మాట అని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో.. ప్రతి డివిజన్ లో ఇన్చార్జీలను నియమించి.. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కార్యకర్తలు ఎలాంటి సమస్య ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చని అన్నారు.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు వేలూరు ఉమామహేష్, నీలి రాఘవరావు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్,మాజీ ఏ యం సి చైర్మన్ కోటేశ్వర రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రీత్ రెడ్డి, 4 డివిజన్ ఇన్ చార్జ్ సందాని, 5 డివిజన్ ఇన్ చార్జ్ సుబ్బా రెడ్డి, 14 డివిజన్ ఇన్ చార్జ్ గిరి రెడ్డి,11 వ డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్, స్థానిక వైసిపి నాయకులు అభిషేక్ రెడ్డి, రామచంద్రారెడ్డి, హరిబాబు, మల్లికార్జున్ రావు, వైసిపి నాయకులు యస్థాని, అలీమ్,రఘు వైసిపి కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
