మన న్యూస్, కొడవలూరు, మే 14:తన సొంత నిధులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయాల మరమ్మతులు చేపడుతున్నారు. కొడవలూరు మండలం మూలకట్ల సంఘంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ గుడి, దర్గా సంఘం రాములవారి గుడి మరమ్మతులకు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ సొంత నిధులను సమకూర్చారు. ఆ నిధులతో గ్రామ ప్రజలు ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఏ నాయకులు వచ్చినా తమను దోచుకున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని, కానీ ప్రశాంతమ్మ ఎంఎల్ఏ అయ్యాక తమకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దంపతులు వారు సంపాదించిన దాంట్లో జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలను తొలగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొడవలూరు పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *