

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఏలేరు కాలువలో ఈతకు దిగడంతో ఇద్దరు నీటి ఉధృతి కొట్టుకుపోయారు.. వారిలో ఒకరిని స్థానికులు రక్షించారు. మరొకరు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన పంది వీర వెంకట సత్యనారాయణ ( విఘ్నేష్) గల్లంతవుగా అతని ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ఫైర్ సిబ్బంది పోలీస్ అధికారులు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానికులచే రక్షించబడిన కాకినాడ సిరి అనే యువకుడ్ని ఏలేశ్వరంలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏలేరు ప్రాజెక్టు అధికారులతోనూ, ఫైర్ సిబ్బందితోను పదేపదే మాట్లాడుతూ గల్లంతయిన యువకుడి ఆచూకీ వీలైనంత త్వరగా తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏలేరు కాలువ నీటి ఉధృతిని తగ్గించాలని అధికారులతో మాట్లాడారు. ఫైర్ సిబ్బందితో మాట్లాడి గజ ఈతగాళ్లు ను రప్పించారు. పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, ప్రత్తిపాడు సబ్ ఇన్స్పెక్టర్ సుమారు రెండు గంటలపాటు ఘటనా స్థలం వద్దే ఉండి ఏలేరు కాలువపై పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.