బుచ్చిరెడ్డిపాలెం మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ 33/11 కు శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 11- 2 కోట్ల 80 లక్షల వ్యయంతో 33/11సబ్‌స్టేషన్ మంజూరు చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి ధన్యవాదాలు.- పంచేడులో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో బుచ్చి గ్రామీణ ప్రాంత లోఓల్టేజ్ సమస్యలకు పరిష్కారం. – సోలార్ వినియోగం పై దృష్టి సారించండి. – ఒకసారి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే 20-25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అభివృద్ధి అంటే మాట్లల్లో కాదు చేతల్లో చేసి చూపడమే చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . పంచేడు పంచాయతీలోని మినగల్లు వద్ద 2 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. మాతృభూమి రక్షణలో వీర మరణం పొందిన మురళి నాయక్ మృతికి సంతాప సూచకంగా 2 ఆమె నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆమె మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….. బుచ్చిరెడ్డి పాళెం మండల గ్రామీణ రైతాంగ ప్రయోజనాల కోసం అడిగిన వెంటనే 2 కోట్ల 77 లక్షల వ్యయంతో 33/11సబ్‌స్టేషన్ మంజూరు చేసిన విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో ఇస్కపాళెం, సాల్మాన్‌పురం, అన్నారెడ్డి పాళెం గ్రామాల పరిధిలో ఓల్టేజితో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోయే సమస్య వుండదన్నారు. ఓవర్ లోడ్ కారణంగా లో పవర్ ట్రిప్ సమస్యలు తలెత్తవని పంచేడు ప్రాంతంలో ఇకపై నిరంతర త్రీఫేస్ విద్యుత్ సరఫరా వుంటుందన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గంలో ఇది రెండవ సబ్ స్టేషన్ నిర్మాణమన్నారు. సోలార్ వినియోగం పై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు రైతులకు సూచించారు. 2 kW నుంచి 3 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే రూ. 60,000 నుంచి రూ. 78,000 వరకు సబ్సిడీ వస్తుందన్నారు. ఒకసారి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే 20-25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చన్నారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాలకన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే, దాన్ని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి జెన్కో డిఇ రమేష్ చౌదరి, మినగల్లు సర్పంచ్ పూజిత, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి నాయకులు బత్తల హరికృష్ణ, ఏటూరి శివ రామకృష్ణా రెడ్డి, టంగుటూరి మల్లారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు