

మనన్యూస్,కామారెడ్డిజిల్లా:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నెలకు వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
