

మనన్యూస్,తిరుపతి:ఎన్డీఎ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గత ప్రభుత్వ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా అన్ని రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని ఆయన తెలిపారు. సూపర్ సిక్స్ అమలులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథలకు నిధులు కేటాయించడం హర్షణీయమని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికల్లో సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేలా బడ్జెట్ భరోసా కల్పించిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయించడం అభినందనీయన్నారు.