తవణంపల్లి సెప్టెంబర్ 07 మనద్యాస (నాగరాజ సరకింటి )
అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.బుధవారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఉత్తర బ్రాహ్మణపల్లి క్రాస్ వద్ద ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందిన వి. వేల్పయని (వయసు 56 సంవత్సరాలు) టీవీఎస్ ఎక్సెల్ లో వెళ్తుండగా, కొండరాజు కాలువ హెచ్‌డబ్ల్యు కు చెందిన యోగేష్ (వయసు 22, తండ్రి జయచంద్రన్) అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో వేల్పయని తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు యోగేష్ పై అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ తో ప్రమాదానికి కారణమైనందుకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *