​ఏర్పేడు:

ఏర్పేడు మండల కేంద్రంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పలు అభివృద్ధి, వ్యాపార కార్యక్రమాలు పండుగ వాతావరణంలో సాగాయి. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు సమక్షంలో ఈ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

​రూ. 69.30 లక్షలతో సైన్స్ ల్యాబ్ ప్రారంభం:

స్థానిక ఏర్పేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( జడ్పీ హై స్కూల్ ) ఆవరణలో ₹69.30 లక్షల భారీ అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల (సైన్స్ ల్యాబ్ ) భవనాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక విజ్ఞాన శాస్త్ర బోధన, ప్రయోగాత్మక పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ సైన్స్ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

​‘జమ్ జమ్’ హోటల్ ప్రారంభోత్సవం:

సైన్స్ ల్యాబ్ ప్రారంభానంతరం, మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘జమ్ జమ్’ హోటల్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక వ్యాపార రంగాలు విస్తరించడం శుభపరిణామమని, నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

​పెద్ద ఎత్తున పాల్గొన్న కూటమి నాయకులు, అధికారులు:

ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, శివశంకర్ రెడ్డి, ఎంఆర్‌ఓ రాజశేఖర్లతో పాటు గాలి కృష్ణవేణి, మోహన్ నాయుడు, బత్తల గిరి నాయుడు, సూరి నాయుడు, రాఘవేంద్ర, గుణా యాదవ్, బాబు నాయుడు, కేశినేని సుబ్రమణ్యం, రాచేటి సుబ్రమణ్యం, చంద్ర శేఖర్ నాయుడు, మునిరెడ్డి, కేకే రమణ, కాంట్రాక్టర్ బాలాజీ, బి. మునిరాజ యాదవ్, నారాయణ, చంద్ర, సురేష్, నరసింహులు, శీను, నరసింహులు నాయుడు, సుధాకర్ రెడ్డి, సదాశంకర, వై. మనోహర్ నాయుడు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మరియు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *