​తిరుపతి, అక్టోబర్ 04: ఈ నెల 5వ తేదీన (సోమవారం) తిరుపతి జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాలలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అర్జీదారులు నేరుగా మీకోసం .ఏపీ . జి ఓ వి .ఇన్వె బ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, సమస్యల పురోగతి తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి పి జి ఆర్ ఎస్ సేవలపై తమ ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చని వివరించారు. పాత అర్జీదారులు రసీదు స్లిప్పును తప్పనిసరిగా తీసుకురావాలని, సమస్యల పరిష్కార సమాచారం ఎస్ఎంఎస్, వాట్సాప్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందుతుందని తెలుపుతూ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *