రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. ఎయిర్‌పోర్ట్ ప్రీపెయిడ్ టాక్సీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి కౌంటర్ వద్ద గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులు, సెక్యూరిటీ సిబ్బంది మరియు టాక్సీ యూనియన్ సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొని గణనాథుని సేవలో తరించారు. ‘రిగాలీయ హోటల్’ వారి సౌజన్యంతో అందజేసిన ప్రసాదాలను ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు, భక్తులకు మరియు టాక్సీ డ్రైవర్లకు యూనియన్ సభ్యులు పంపిణీ చేశారు. ప్రతి ఏటా గణపతి ఉత్సవాన్ని ఎంతో నిష్ఠతో నిర్వహిస్తున్నామని, స్వామివారి కృపతోనే తమకు ఎల్లప్పుడూ శుభాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తెలిపారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం, ఈరోజు సాయంత్రం వేళ వినాయకుని విగ్రహాన్ని అత్యంత వైభవంగా నిమజ్జనం చేయడం జరిగింది

