రేణిగుంట సెప్టెంబర్ 9.
మంగళం డిపో నుండి త్వరలో నడపబడే ఎలెక్ట్రిక్ బస్సుల కోసం శరవేగంగా జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను బుధవారం ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంగళం డిపో మేనేజర్ శ్రీమతి నిర్మల, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్టార్ కృష్ణ శాలువాతో సత్కరించి, బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఎలెక్ట్రిక్ బస్సుల నిర్వహణకోసం మంగళం డిపోలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను తనిఖీ చేశారు.అనంతరం డిపోలోని ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ఉద్యోగుల సమస్యలను తెలియజేయమన్నారు. ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ ఎం.డి గతంలో మినిట్స్ లో ప్రస్తావిస్తూ యాభై శాతం బస్సులను మరియు ఉద్యోగులను తిరిగి మంగళం డిపోలోకి తీసుకుంటామన్న హామీని చైర్మన్ కు గుర్తు చేశారు. సానుకూలంగా స్పందించిన జోనల్ చైర్మన్ పూల నాగరాజ్ తప్పనిసరిగా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని, ఉద్యోగులెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెట్టే ఎలెక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగులచేతనే నడిపేవిధంగా చర్య తీసుకోవాలని కృష్ణా కోరగా తప్పనిసరిగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ లతోనే ఎలెక్ట్రిక్ బస్సులను నిర్వహించేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎంయు డిపో సెక్రటరీ నాయక్ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మంగళం డిపోలోనే డీజిల్ పంపిణీ, మెయింటెనాన్స్ చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలోఅలిపిరి డిపో మేనేజర్ హరిబాబు, మంగళం డిపో అసిస్టెంట్ మేనేజర్లు పద్మ, రాజశేఖర్,డి. ఈ. లక్ష్మీనారాయణ, సెక్యూరిటీ ఎస్సై తిమ్మారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని చైర్మన్ పూల నాగరాజ్ కు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *