చీకటి రోజును గుర్తుచేసుకుంటూ.. 53 కొవ్వొత్తులతో సంఘీభావం, తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ నేతలు..

ఉదయగిరి, సెప్టెంబర్ 9, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఒక అసత్య కేసులో అరెస్టు చేసి 53 రోజుల పాటు నిర్బంధించిన ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించాయి.చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలిచి తమ సంఘీభావాన్ని తెలియజేశారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.కష్టకాలంలోనూ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసం చెక్కుచెదరలేదని అన్నారు. దేవుని సంకల్పంతో చివరకు న్యాయం గెలిచి, సత్యమే విజయం సాధించిందని పేర్కొన్నారు.ఆ చీకటి రోజును గుర్తుచేసుకుంటూ ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని 53 కొవ్వొత్తులను చేతబూని నిరసనాత్మకంగా కాకుండా సంఘీభావానికి ప్రతీకగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 53 రోజుల నిర్బంధాన్ని సూచించేలా 53 కొవ్వొత్తులను వెలిగించి, ఆ చీకటి రోజులను పారదోలుతూ చంద్రబాబు నాయుడుకి తమ అచంచలమైన మద్దతును, అభిమానాన్ని చాటిచెప్పారు.ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ.. “చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు.. వెలుగు తప్పక వస్తుంది. అసత్యం ఎన్నాళ్లు నిలిచినా.. చివరికి సత్యమే గెలుస్తుంది” అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై తమకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పారు.53 కొవ్వొత్తుల వెలుగులో అది కేవలం ఒక చీకటి రోజును గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం, న్యాయం, సత్యం పట్ల తమ నిబద్ధతను చాటిచెప్పిన ప్రతీకాత్మక కార్యక్రమంగా ఉదయగిరి నియోజక వర్గంలో ఈ కార్యక్రమం ఘనంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *