​తిరుపతి పర్యాటక రూపురేఖలు మారుస్తామన్న ముఖ్య అతిథి, తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి ఆగష్టు 16.
ఆంధ్రప్రదేశ్ ఫైర్ మర్చంట్స్ అసోసియేషన్ (క్రాకర్స్ అసోసియేషన్) 100వ సంవత్సరాల వేడుకలు తిరుపతి వినాయక సాగర్ లో జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ఫైర్ క్రాకర్స్ (బాణసంచా) షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్ క్రాకర్స్ అసోసియేషన్ తమ 100 సంవత్సరాల వేడుకలను పవిత్ర నగరమైన తిరుపతిలో నిర్వహించడం చాలా ఆనందదాయకం అని ఆయన పేర్కొన్నారు. నగరవాసులు తమ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ బాణసంచా ప్రదర్శనను సంతోషంగా వీక్షించడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, తిరుపతిలో ఇన్ని వేలాది మందిని ఒకేచోట చూసి చాలా రోజులైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ప్రదర్శన అందరికీ స్పష్టంగా కనిపించేలా బయట అన్ని వైపులా ఏర్పాట్లు చేశారాని,రాబోయే రోజుల్లో తిరుపతిలో పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతి నగరంలో ఎక్కువ సమయం ఆహ్లాదకరంగా గడిపే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటువంటి వినోదభరితమైన కార్యక్రమాలు నగరంలో మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఫైర్ మర్చంట్స్ అసోసియేషన్ నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదవ్ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ,శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి,పులివర్తి సుధా రెడ్డి, అదనపు ఎస్పీ రవిమహనోహరాచారి, కూటమి నాయకులు, క్రాకర్ అసోసియేషన్ సభ్యులు,నగరవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *