శ్రీకాళహస్తి ఆగష్టు 15.
ఆర్డీవో కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో గర్వకారణమని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. అధికారులతో, కూటమి నాయకులతో మరియు ప్రజలతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు చెప్పారు. పేదరిక నిర్మూలనతో పాటు విద్య, వైద్యం, తాగునీరు, డ్రైనేజీ మరియు రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనలో ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు.
రానున్న రోజుల్లో శ్రీకాళహస్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని, అందుకోసం సరికొత్త ప్రాజెక్టులు మరియు భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు మరియు ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు


