కలిగిరి జూలై 31, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కలిగిరి మండలంలోని కృష్ణారెడ్డి పాలెం కుడుమలదిన్నెపాడు ఆంజనేయ స్వామి గుడిలో దొంగలు పడ్డారు. గ్రామస్తులు పోలీసుల సమాచారం మేరకు కృష్ణారెడ్డి పాలెం లో అంకమ్మ పోలేరమ్మ తల్లి గుడిలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు రెండు గుడి ల లోని అమ్మవారి మంగళ సూత్రాలు కాసులు దొంగలించారూ. అదేవిధంగా రెండు గుడుల్లో భక్తులు ఉంచిన హుండీలను దూరంగా తీసుకెళ్లి ఆ ఉండి ని పగలగొట్టి అందులోనే కానుకలను తీసుకెళ్లారు. కుడుమలడిన్నపాడులో ఇటీవల నూతనంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసి తిరునాళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సాయంత్రం వరకు పూజలు, భజనలు జరుగుతున్నాయి. భక్తులు వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ దొంగల పడి అక్కడ ఉన్న రెండు ఉండీలను తీసుకెళ్లి పగలగొట్టారు. అందులో ఉన్న సుమారు 50000 రూపాయల వరకు కానుకలు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.విషయం తెలుసుకున్న కలిగిరి ఎస్సై లీథీఫనిసా తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాల కు వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై గ్రామ పెద్దలను గుడికి సంబంధించిన కమిటీ వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఎస్సై సయ్యద్ లతీఫనిషా తెలిపారు.