పరుసు రమణమ్మ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ LOC చెక్కు పంపిణీ..!

వింజమూరు, జలదంకి ,జూలై 30,మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

జలదంకి మండలం, చామదల గ్రామానికి చెందిన శ్రీమతి పరుసు రమణమ్మ వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) ద్వారా మంజూరైన రూ.2,00,000/- విలువైన ఎల్.ఓ.సి. (LOC) చెక్కును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన ప్రతి కుటుంబానికి సీఎం సహాయనిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.వైద్య చికిత్స కోసం మంజూరైన ఈ ఆర్థిక సహాయం కుటుంబానికి ఎంతో ఊరటనిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, అలాగే తమ సమస్యను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కిహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలదంకి మండల అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి, సోమశిల జలాశయం ఉపాధ్యక్షులు మధుమోహన్ రెడ్డి, తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *