కొండాపురం జులై 30 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.


కొండాపురం మండలం కొమ్మి గ్రామ హరిజనవాడలో బూత్ నెంబర్ 211 ఇంచార్జీబి.శ్రీను ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇంటింటికి కూటమి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కొండాపురం మండల అధ్యక్షులు పోలినేని చంద్రబాబు, మాజీ మండల అధ్యక్షులు చెరుకూరు వెంకటాద్రి నాయుడు,క్లస్టర్ ఇంచార్జీ పోలినేని రమేష్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్,కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ప్రజలపై మన రాష్ట్రం అభివృద్ధి రీతిలో చేయడానికి నారా చంద్రబాబు నాయుడు, యువ నేత ఐటి శాఖ మాత్యులు నారా లోకేష్, ఎంతో కష్టపడుతున్నారని వారు తెలియజేశారు. మన రాష్ట్రంలో ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళుతున్న నారా చంద్రబాబు నాయుడుకి యువనేత నారా లోకేష్ బాబుకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో మనమందరమే కట్టుబడి పనిచేయాలని స్థానిక సమస్త ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలతో అన్ని గ్రామ పంచాయతీలలో విజయం సాధించేలా ప్రజలందరూ కృషి చేయాలని వారు తెలిపారు. అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంతో కష్టపడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని వారు తెలియజేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలని పరామర్శించి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయుకులు చెరుకూరి శేషయ్య, ఆకుల మహేష్, గద్దె శ్రీకాంత్, యారం చెన్నయ్య, బండ్లమూడి మల్లి ,బూత్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.
