కావలి జులై 13 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ నీ మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ కావలి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏవో కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐటియుసి కావలి పట్టణ గౌరవ అధ్యక్షులు బిల్లా పురుషోత్తం మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం భారతీయులకు సార్వత్రిక ఓటుహక్కు కల్పించిందన్నారు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ కార్యక్రమం చేపట్టక చేపట్టకముందే దేశ ప్రజలలో అర్హులందరికీ ఓటరుగా నమోదు చేయడానికి ప్రాధాన్యతను ఇచ్చారు ఫోటో గుర్తింపు కార్డు లేకుండా ఓటర్ జాబితాలో పేరు ఉంటే చాలు వేరే ఏదైనా గుర్తింపు పత్రంతో ఓటు వేసే వెసులుబాటు కల్పించారన్నారు. భారతీయ పౌరులందరికీ ఓటు ఉండేది అన్నారు దేశంలో సుదీర్ఘకాలం నివసించి భారతీయ పౌరసత్వం పొందితే తప్ప విదేశీయులు ఎవరికి ఓటు వేసే వీలు ఉండేది కాదన్నారు భారత ఎన్నికల కమిషన్ సర్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని జులై 14న ముగుస్తుందని జీవించి ఉన్న చాలా మంది ఇంకా ఇప్పటికి ఓటరుగా నమోదు కాలేదని చాలా ప్రాంతాల్లో బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి సర్ పత్రాలు ఇవ్వకపోవడం సమయానికి నమోదు ప్రక్రియ పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యంగా కనిపిస్తుంది అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సామాన్య మధ్యతరగతి పేదలకు సర్ పత్రాలు నింపడానికి ప్రజలకు అవగాహన లోపించడం క్షేత్రస్థాయిలో ఉన్న నిబంధనలు అర్థం కాకపోవడం ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన రాష్ట్రంలో యువతీ యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సర్ లో నమోదు చేసుకోలేదు 2002 నాటి సర్ జాబితాలో వారి పేర్లు వారి తల్లిదండ్రులు పేర్లు తాతలు బంధువుల పేర్లు ఉన్న వారందరూ ఈసీ పౌరత్వ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుందన్నారు సరైన సమాచారం అందకపోవడం సాంకేతిక లోపాల వల్ల అర్హులైన ఓటర్లు పేర్లు జాబితా నుండి తొలగిపోయే ప్రమాదం ఏర్పడిందని దుర్వినియోగం చేస్తున్నారని అనుమానం సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి సర్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మూడు నెలలు పాటు పొడిగించాలని అర్హులైన అందరికీ ఓటు హక్కు పొందే విధంగా నిర్దిష్ట చర్యలు చేపట్టవలసిందిగా సిపిఐ ఏఐటీయూసీ కావలి పట్టణ సమితి కోరుచున్నాము ఈ కార్యక్రమానికి అధ్యక్ష కార్యదర్శి మండ్ల వెంకటేశ్వర్లు కె చంద్రశేఖర్ కోశాధికారి బి హరిబాబు సిపిఐ కావలి డివిజన్ సహాయ కార్యదర్శి దమ్ము దర్గాబాబు చేవూరు కొండయ్య ఫుల్ల ఆదినారాయణ చలమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *