మే20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి—ఏఐటియుసి—సిఐటియు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: కార్మికుల హక్కులను హరించే 4 లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని మరియు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటియుసి- సిఐటియు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో స్థానిక ఏఐటియుసి కార్యాలయం నందు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి పి.వి రమణ, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు లు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద బహుముఖ దాడి చేపట్టిందన్నారు. 95 శాతంగా ఉన్న కార్మికులకు తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా కార్మిక చట్టాలు,హక్కులపై దాడి చేస్తున్నారని,
కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా,పని గంటలతో సంబంధం లేకుండా కార్మికులను కట్టు బానిసలుగా చేసే పరిస్థితి నేడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.అనేక పథకాల్లో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, వివిధ పథకాల్లో పని చేస్తున్న స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు లేవని, ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతతో జీవిస్తున్నారన్నారని,
ప్రాణాలర్పించి 8 గంటల పని దినం,సమ్మె హక్కు,కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కులు సాధించు కొనగా,నేడు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పగించే పాలన సాగుతుందన్నారు. 27 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చేసి కార్మికులను బానిసలుగా మార్చే ప్రక్రియ మోడీ ప్రభుత్వం చేపట్టిందని,మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులపై దాడి పెరిగిందని,అందులో భాగంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే రైతులు ఏడాది పాటు 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయి తిప్పికొట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని ప్రతిఘటించకోతే కార్మిక వర్గానికి మనుగడ ప్రమాదంలో పడుతతుందన్నారు. ఇటువంటి నేపధ్యంలో పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను, సమ్మె చేసే హక్కును, కనీస వేతనాలు సాధన కోసం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం మే 20 తేదీన జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెను పట్టణంలోని ఉద్యోగ- ఉపాధ్యాయ, కార్మిక,కర్షక, మేధావులు, వ్యాపారులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఇరుపోతూ ఓబులేసు, పట్టణ నాయకులు నాగరపు సత్యరాజు,అమిలిపోగు బాబు,దియ్యాల వెంకటేశ్వర్లు, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి ఈర్ల నగేష్,పట్టణ నాయకులు రషీద్,తంబీ,వెంకటేష్,పడిగే వెంకటరమణ,చిన్నా తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…