

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
:కార్మికులందరూ ఎగతాటిపై కొచ్చి,సమన్వయంతో తమ సమస్యలకు పరిష్కారాలు సాధించుకోవాలని స్థానిక తెదేపా నాయకులు మూది నారాయణస్వామి పిలుపునిచ్చారు.గురువారం నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా మార్కెట్ కార్మిక యూనియన్,తొట్టి రిక్షా కార్మిక యూనియన్ సభ్యులతో కలిసి స్థానిక శివాలయం వద్ద గల కార్మిక భవనం వద్ద ఎర్రజెండాను నారాయణస్వామి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కార్మికులతో పాటు ఎర్ర చొక్కాను ధరించి నారాయణస్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ కార్మిక,కర్షకులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.కార్మిక సంఘాలన్నీ ఏకృతమై సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఏ సంఘంలోని సభ్యుడికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్ని సంఘాలు కలిపి ఐకమత్యంతో పోరాడి ఆ సభ్యుడికి పరిహారం అందించడం గాని,సహాయం చేయడం గాని చేయవచ్చని ఆయన అన్నారు.సమాజంలో శ్రామిక,కార్మికులకు తగిన గౌరవం ఇవ్వాలని,జట్టు కూలీలు, మార్కెట్ కూలీలు వ్యాపారస్తులతో సమన్వయంతో పనిచేస్తూ తగిన ఆదాయం వచ్చేలా ముందుకు సాగాలని ఆయన కోరారు.అనంతరం నారాయణస్వామి ఆధ్వర్యంలో కార్మికులు కార్మికుల భవనం నుండి ఏలేశ్వరం బాలాజీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో సత్తిబాబు,సన్యాసిరావు, కంచు బోయిన నాగేశ్వరావు,గెద్ద రాము, కంది సత్తిబాబు,కోరాడ అప్పారావు అన్నవరం,శ్రీను,సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.