శ్రీకాళహస్తి.

శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నుండి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి నెల్లూరు గాంధీ మరియు కౌన్సిలర్ అభ్యర్థుల అఖండ విజయం కొరకు ఎన్నికల ప్రచారం ప్రారంభించి నాలుగు వీధులగుండా సాగిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం.
డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ నేడు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశని అంటుతున్నాయని, నేటి ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడ్డి విరుస్తునాయని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలుకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీ ప్రేమతో స్వాగతం పలుకుతున్నారని,కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఈ ఎన్నికలు అత్యంత చేరువ చేశాయని,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఓబీసీ పరిశీలకులు కంభంపాటి మురళి,జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా,కృష్ణమూర్తి, జిల్లా ఐ ఎన్ సి కలెక్టరేటివ్ రెప్రజెంటేటివ్ చైర్మన్ చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్,జిల్లా కార్యదర్శి గోపి, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రేమసుందరం,జిల్లా ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్,శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ,శంకర్, ఎర్రటి గౌరీ, నాగరాజు, మహేష్, బాబు, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి చిరంజీవి, చందు,అజిత్, శాన్ మైకేల్,స్వామినాథన్, కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *