తిరుపతి.

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పాలడుగు విజయ , చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ని, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ , తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి,ఎమ్మెల్యే పులివర్తి నాని కి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.డిప్యూటీ మేయర్‌ గా నూతన బాధ్యతలు స్వీకరించిన పాలడుగు విజయ కి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి , ఎమ్మెల్యే పులివర్తి నాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి నగర అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed