*కలిగిరి, మన ధ్యాస RC ఇంచార్జ్ నాగరాజు, నవంబర్ 20:*
నెల్లూరు జిల్లా కలిగిరి మండల జెడ్పీటీసీగా నూతనంగా ఎన్నికైన *మెట్టుకూరి శిరీషా రెడ్డి* శుక్రవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.కలిగిరి మండలం అనంతవరం గ్రామానికి చెందిన మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ *మెట్టుకూరి చిరంజీవి రెడ్డి* సతీమణి అయిన శిరీషా రెడ్డి, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిగిరి ZPTC స్థానం నుండి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.*ఈ సందర్భంగా శిరీషా రెడ్డి మాట్లాడుతూ…*తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన కలిగిరి మండల ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కూటమి ప్రభుత్వ సహకారంతో జెడ్పీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ కలిగిరి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజా ప్రతినిధిగా అధికారుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని, *మండల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం* అని శిరీషా రెడ్డి స్పష్టం చేశారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
