పత్రికా ప్రకటన
2026 వ సంవత్సరం 2వ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ మేరుకు 17.11.2026 వ తేదీ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది.
రేణిగుంట మండలం, స్వర్ణ గ్రామం గాజులమండ్యం నందు 5 గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు గాను నామినేషన్ లు దాఖలు అయినవి. వాటికి సంబంధించి స్క్రూటినీ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం 18.11.2026 వ తేదీ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం స్వర్ణ గ్రామం గాజులమండ్యం నందు జరుగును. సదరు స్క్రూటినీ కి సంబంధించి గ్రామ పంచాయతీల వారీగా క్రింద కనపరచిన విధంగా సమయం కేటాయించబడినది. కావున నామినేషన్ వేసిన అభ్యర్థులు మీకు/మీ సెగ్మెంట్ కు కేటాయించిన సమయములలో మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయం స్వర్ణ గ్రామం గాజులమండ్యం నందు హాజరు అవ్వవలసిందిగా కోరడమైనది.
పంచాయతీల వారీగా స్క్రూటినీ తేదీ & సమయాలు:
- 1. అత్తూరు: 18-11-2026, ఉదయం 08:00 AM నుండి 09:00 AM వరకు
- 2. గాజులమండ్యం: 18-11-2026, ఉదయం 10:00 AM నుండి 11:00 AM వరకు
- 3. తండ్లం: 18-11-2026, ఉదయం 11:00 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు
- 4. విప్పమానుపట్టెడ: 18-11-2026, మధ్యాహ్నం 01:00 PM నుండి 02:00 PM వరకు
- 5. సూరప్పకశం: 18-11-2026, మధ్యాహ్నం 02:00 PM నుండి 03:00 PM వరకు
అభ్యర్థులకు ముఖ్య గమనిక (Note 🙂
సంబంధిత టైమ్ స్లాట్ లో పేర్కొన్న పంచాయతీకి చెందిన నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. కేటాయించిన టైమ్ స్లాట్ ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించడం జరగదు. ఈ విషయమై రిటర్నింగ్ ఆఫీసర్ (RO) గారి నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది.