- ఎలమండ్యం నుంచి ప్రారంభమై జీపాళెం వరకు పంచాయతీల వారీగా సమయాల కేటాయింపు
- కేటాయించిన సమయానికి మాత్రమే అభ్యర్థులు హాజరుకావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశం
రేణిగుంట, నవంబర్ 17:
రేణిగుంట మండలంలోని మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ బుధవారం (18.11.2026) నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి (RO) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
2026వ సంవత్సరం 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మేరకు మంగళవారం (17.11.2026) సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. రేణిగుంట మండలం, స్వర్ణ గ్రామం ఎలమండ్యం నందు గల ఎలమండ్యం, గురవరాజుపల్లి, జీపాళెం గ్రామ పంచాయతీలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రేపు ఎలమండ్యం స్వర్ణ గ్రామంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. రద్దీని నివారించేందుకు గ్రామ పంచాయతీల వారీగా వేర్వేరు సమయాలను కేటాయించారు:
- ఎలమండ్యం: ఉదయం 08:00 గంటల నుండి 11:00 గంటల వరకు
- గురవరాజుపల్లి: ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
- జీపాళెం: మధ్యాహ్నం 1:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు
అభ్యర్థులకు ముఖ్య గమనిక:
నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమ పంచాయతీకి కేటాయించిన టైమ్ స్లాట్లో మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి హాజరుకావాలని స్పష్టం చేశారు. కేటాయించిన సమయం ముగిసిన తర్వాత వచ్చే అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని, ఈ విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ (RO) నిర్ణయమే తుది నిర్ణయమని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.