​2026వ సంవత్సరపు 2వ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ మేరకు నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

​రేణిగుంట మండలం, రేణిగుంట గ్రామ పంచాయతీలోని సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ (పరిశీలన) ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం నవంబర్ 18వ తేదీన రేణిగుంట గ్రామ పంచాయతీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిర్వహించబడుతుందని రిటర్నింగ్ అధికారి (RO) ఒక ప్రకటనలో తెలిపారు.

​ఈ స్క్రూటినీ ప్రక్రియ కోసం సర్పంచ్ మరియు వార్డుల వారీగా కింది విధంగా సమయాలు కేటాయించబడ్డాయి:

  • ​సర్పంచ్: 18-11-2026, ఉదయం 08:00 AM నుండి 09:30 AM వరకు
  • ​వార్డు నెంబరు 1 – 5: 18-11-2026, ఉదయం 09:30 AM నుండి 11:00 AM వరకు
  • ​వార్డు నెంబరు 6 – 10: 18-11-2026, ఉదయం 11:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు
  • ​వార్డు నెంబరు 11 – 15: 18-11-2026, మధ్యాహ్నం 01:30 PM నుండి 03:00 PM వరకు
  • ​వార్డు నెంబరు 15 – 20: 18-11-2026, మధ్యాహ్నం 03:00 PM నుండి సాయంత్రం 04:30 PM వరకు

​అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి కీలక సూచనలు:

నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ సెగ్మెంట్‌కు కేటాయించిన సమయములో మాత్రమే రేణిగుంట గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారి వద్దకు హాజరు కావాలని కోరడమైనది. సంబంధిత టైమ్ స్లాట్లలో పేర్కొన్న పంచాయతీకి చెందిన నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కేటాయించిన టైమ్ స్లాట్ ముగిసిన తర్వాత వచ్చే అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదని, ఈ విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ (RO) నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *