- పవన్ సాయి ట్రస్ట్ హాస్పటల్ చైర్మన్ పతివాడ రామారావు….
గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 15:బాలల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ మరియు పవన్ సాయి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, చైర్మన్ పతివాడ రామారావు చేతుల మీదుగా మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కుర్చీలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పతివాడ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలతో పాటు అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితిలకి కూడా వ్యత్యాసం ఉంది పూర్తి విద్యా విధానాలన్నీ కూడా మారి భావితరాలకు బాసటగా నిలుస్తున్నాయని తెలిపారు ప్రస్తుత సమాజంలో నేటి బాలలే రేపటి పౌరులుగా మారి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని తెలుపుతున్నాను విద్యార్థుల భవిష్యత్తు పాఠ్యపుస్తకంతో పాటు, క్రమశిక్షణ విద్యనభ్యసించడం పాటు ప్రజలకు సేవా కార్యక్రమం ఉంటాయని సందర్భంగా తెలిపారు. బాల్యం చాలా విలువైనదని బాల్య వ్యవస్థ రేకుటి భవిష్యత్తు తరాలకు పునాది అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా తెలిపారు మా చారిటబుల్ ట్రస్ట్ అలాగే మా హాస్పటల్ ఎప్పుడూ కూడా పేదవారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.సౌకర్యాలకు తోడ్పడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.సమాజానికి సేవ చేయడం మా బాధ్యతగా,భావితరాల భవిష్యత్తుకు తోడ్పడటం మా లక్ష్యంగా పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుంది.పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్స్ ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మాకు సహాయ సహకారాలు అందించిన పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుత సమాజంలో ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహనతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాజువాకలో ప్రజా సేవ చేస్తున్న చైర్మన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అలాగే పాఠశాల టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.