

మనన్యూస్:పినపాక భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల పినపాక మండల కాంగ్రెస్ కమిటీ విచారం వ్యక్తం చేసింది శుక్రవారం పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామనాధం మాట్లాడుతూ.. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపించిన ఒక మహనీయుని కోల్పోవడం భారతదేశ ప్రజలకు దురదృష్టకరమని అన్నారు భారత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని, భారతదేశాన్ని ఆర్థిక రంగంలో అగ్రగామిలో ఉంచారని కొనియాడారు ఆయన అకాల మరణం చాలా బాధాకరమని, కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరనిలోటని అన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జక్కా వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు గీద సాయి బాబు, గొంది రాధ,బయ్యారం మాజీ సర్పంచ్ బొగ్గం నాగమణి,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, అచ్చ నవీన్, ఉడుముల లక్ష్మిరెడ్డి, మాటూరి ప్రవీణ్, బోడ లక్ష్మణ్ రావ్, సతీష్, జనార్దన్, కొండేరు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.