రేణిగుంట ఎంఈఓ కె . రంగనాధయ్య.
రేణిగుంట:
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని (నవంబర్ 26) పురస్కరించుకుని విద్యార్థుల్లో రాజ్యాంగంపై పూర్తి అవగాహన, ప్రజాస్వామ్య విలువలు మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతోనే మండల స్థాయి విద్యార్థుల శాసనసభ (మాక్ అసెంబ్లీ) పోటీలను నిర్వహించినట్లు రేణిగుంట మండల విద్యాశాఖాధికారి ( ఎంఈఓ ) కె . రంగనాధయ్య తెలిపారు. సోమవారం రేణిగుంటలోని జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ పాఠశాల వేదికగా ఈ పోటీలు ప్రశాంతంగా, ఘనంగా ముగిశాయని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను, రాజ్యాంగ పరిజ్ఞానాన్ని అద్భుతంగా కనబరిచారని కొనియాడారు.
వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు:
ఉపన్యాస పోటీ: ఎం .జి . సోఫియా (9వ తరగతి, జడ్పీహెచ్ఎస్ తారకరామనగర్)
వ్యాసరచన పోటీ: పి . శేషాద్రి (10వ తరగతి, జడ్పీహెచ్ఎస్ బాయ్స్ రేణిగుంట)
క్విజ్ పోటీ: కె . విక్రమ్ (9వ తరగతి, జడ్పీహెచ్ఎస్ గుత్తివారిపల్లి)
మంగళవారం శ్రీకాళహస్తిలో నియోజకవర్గ స్థాయి పోటీలు:
మండల స్థాయిలో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచిన ఈ ముగ్గురు విద్యార్థులు మంగళవారం (10.11.2026) మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీకాళహస్తిలోని ఎం ఆర్ సి (మండల వనరుల కేంద్రం) లో నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలలో పాల్గొంటారని ఎంఈఓ రంగనాధయ్య తెలియజేశారు. విజేతలైన విద్యార్థులు సమయపాలన పాటిస్తూ శ్రీకాళహస్తి ఎం ఆర్ సి కి హాజరై, నియోజకవర్గ స్థాయిలోనూ మండల కీర్తిని చాటాలని ఆయన ఆకాంక్షించారు.
