ప్రయాగరాజ్ నందు జరిగిన డెలిగేట్స్ సమావేశములో, నేషనల్, కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు ఆర్.ఎం. విజయకుమార్ కు పెన్షనర్స్ ల సమస్యల గురించి మాట్లాడేందుకు వేదికపై ఆహ్వానించారు.ఈ వేదికపై పలు రకాల పెన్షనర్స్ సమస్యలను గురించి వివరించారు.పాత పెన్షన్ విధానములో ప్రవేశపెట్టిన గ్రాడ్యుటి నీ 65,70,75,80 సంవత్సరాలకు, కుదించాలని,8 వ వేతన సంఘములోని టి ఓ ఆర్ రద్దుచేయడానికి అన్ని విధాల పోరాడి సాధించడానికి కృషిచేయాలని,పెన్షనర్స్ పొందుతున్న పాసులను భౌతికముగా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అనుమతిని తీసుకురావాలని, మెడికల్ విభాగములో పెన్షనర్స్ కు అన్ని రకాల వైద్యం అందించాలని కోరారు. దీనిపై ప్రెసిడెంట్ శ్రీధర్ అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ కృష్ణ దాస్ కోశాధికారి రాఘవరెడ్డి చీఫ్ అడ్వైజర్ మనోహరం,సంజయ్, శేఖర్,జానకి రామయ్య, సుబ్బరాజు,చంద్రయ్య మరియు బాభూ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *