కలిగిరి, నవంబర్ 3 (మన ధ్యాస ప్రతినిధి నాగరాజు):
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 49 పోలింగ్ బూత్ లలో 1 జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ ఎన్నికలలో మండల వ్యాప్తంగా మొత్తం 72% శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు మోహరించి పరిస్థితిని సమీక్షించారు.అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ బాక్సులను భద్రంగా స్ట్రాంగ్ రూమ్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు.