ప్రతి ఇంటా సైకిల్ గుర్తుకే ఓటేస్తామంటూ ప్రజల ఘన స్వాగతం
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో జెడ్పిటిసి, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది
కూటమిలో భాగంగా తొట్టంబేడు మండలం జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ‘రావిళ్ళ మునిరాజా నాయుడు’ కి మరియు ఎంపీటీసీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండలంలో విస్తృతంగా పర్యటించారు.
ముందుగా సింగమాల గ్రామంలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి శుభసూచకంగా ఎన్నికల ప్రచారాన్ని వైభవంగా ప్రారంభించారు.
ఆలయం వద్ద నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు మరియు బాణాసంచా పేలుళ్ల నడుమ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు మరియు స్థానిక గ్రామస్తులతో కలిసి ప్రతి వీధిలోనూ ఇంటింటా ప్రచారాన్ని ఘనంగా చేపట్టారు.
ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకుంటూ, కూటమి పాలనలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి హారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
గ్రామంలో ఎటు చూసినా పసుపు జెండాల కోలాహలం, నాయకులు మరియు కార్యకర్తల నినాదాలతో పండుగ వాతావరణం నెలకొంది.
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, మండలంలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, జెడ్పిటిసి-ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ప్రచారాన్ని జయప్రదం చేశారు.

