• *​తిరుపతి రూరల్ మండల నాయకులతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి రూరల్ మండలంలోని అన్ని ఎంపీటీసీ,జడ్పీటీసీ స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల ఘనవిజయానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సైనికుల్లా పనిచేయాలని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
తిరుపతి రూరల్ మండల పరిధిలో జరగనున్న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల ప్రచార వ్యూహ రచనలో భాగంగా మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి , చంద్రగిరినియోజకవర్గ యువనేత పులివర్తి వినీల్ ముఖ్య అతిథులుగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మండలంలోని ఆయా పంచాయతీల వారీగా ఎన్నికల ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ అభ్యర్థులు సీనియర్ నాయకులు,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *