21 స్థానాలకు 138 నామినేషన్లు దాఖలు.

​ ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ)…

​సెగ్మెంట్ల వారీగా సమయ వేళలు కేటాయించిన రిటర్నింగ్ అధికారి..

​రేణిగుంట:

2026వ సంవత్సరం 2వ సాధారణ స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ మేరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అక్టోబర్ 23 (శుక్రవారం) సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది.
​రేణిగుంట మండలం పరిధిలోని మొత్తం 21 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను 138 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారి పేర్కొన్నారు.
​
​ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 24 ( శనివారం) న రేణిగుంటలోని ఎంపీడీఓ కార్యాలయంలో (రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం) నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ నిర్వహించనున్నారు.
​అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా ఉండటానికి సెగ్మెంట్ల వారీగా పరిశీలన సమయాలను కేటాయించారు:

​ఉదయం 08.00 గంటలు నుండి 10.00 గంటలు వరకు:-
అత్తూరు (3), ఏలమండ్యం (4), గాజులమండ్యం -1 (5), గాజులమండ్యం -2 (6), గుత్తివారిపల్లి (7), జీపాలెం (5), కరకంబాడి-1 (8).

​ఉదయం 10.15 గంటలు నుండి మధ్యాహ్నం 12.15 గంటలు వరకు:
కరకంబాడి-2 (6), కరకంబాడి-3 (20), కృష్ణాపూర్ (5), మామండూర్ (6).

​మధ్యాహ్నం 12.45 గంటలు నుండి 02.45 గంటలు వరకు:-
ఆర్. మల్లవరం (4), రేణిగుంట-1 (7), రేణిగుంట-2 (6), రేణిగుంట-3 (7), రేణిగుంట-4 (5).
రేణిగుంట-5 (8),

​మధ్యాహ్నం 03.00 గంటలు నుండి సాయంత్రం 04.30 గంటలు వరకు:-
రేణిగుంట-6 (6), సూరప్పకాసం (6), తుకివాకం (7), వెంకటాపురం (7).

​నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ సెగ్మెంట్‌కు కేటాయించిన సమయానికే ఎంపీడీఓ కార్యాలయానికి హాజరు కావాలని రిటర్నింగ్ అధికారి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *