శరన్నవరాత్రి ఉత్సవాల వేళ తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతున్న తరుణంలో, తుమ్మలగుంట పంచాయతీ పరిధిలోని చెంచులక్ష్మి కాలనీలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

ఈ వేడుకల్లో భాగంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన తుడా ఛైర్మన్‌కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు,అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు.

నవరాత్రుల విశిష్టతను పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు, మహా మంగళహారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వయంగా పూజాదికాలలో పాల్గొని, ప్రత్యేక పూజలు సమర్పించారు.

అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,స్థానిక కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు, మహిళా భక్తులు మరియు చెంచులక్ష్మి కాలనీ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *