శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
ప్రత్యేక పూజలు నిర్వహించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు
రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థన
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఓం శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.
ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ వేడుకల్లో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో మూలవిరాట్కు నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన, విశేష హారతి పూజా కార్యక్రమాల్లో తుడా ఛైర్మన్ పాల్గొన్నారు.
పండితులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.


