డీఎస్పీ యతేంద్ర పర్యవేక్షణలో భద్రతా చర్యలు.. ఎస్ఐ మధుసూదన్రావు ఆధ్వర్యంలో పరిశీలన
రేణిగుంట: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రేణిగుంట రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ యతేంద్ర పర్యవేక్షణలో, ఎస్ఐ మధుసూదన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో స్టేషన్ పరిసరాలు, ప్రయాణికుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
బ్రహ్మోత్సవాలకు తిరుమలకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా ఉంచాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రైల్వే స్టేషన్లో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.


