ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ… ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఉందా? లేదా?*

*ఉదయగిరి, అక్టోబర్ 15, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ వేడి రాజుకుంటుంటే, ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై పెద్ద చర్చే జరుగుతోంది. అధికార టీడీపీ టికెట్ల కోసం నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
*వైసీపీ నాయకత్వం ఎక్కడ?గత ఎన్నికల వరకు ఉదయగిరి నియోజకవర్గంలో బలమైన కేడర్ తో ఉన్న వైసీపీ, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, మండలాల ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఎవరూ కూడా ఎన్నికలపై సమావేశాలు పెట్టడం లేదు. కనీసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే పరిస్థితి కూడా లేదని వైసీపీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి.కార్యకర్తల్లో అయోమయం!టీడీపీలో టికెట్ల కోసం క్యూ కడుతుంటే, వైసీపీలో మాత్రం “పోటీ చేయాలా? వద్దా?” అనే అయోమయంలో కార్యకర్తలు ఉన్నారట. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా లేరా? ఉంటే వారికి అండగా నిలిచే నాయకత్వం ఎక్కడ? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయగిరి వీధుల్లో వినిపిస్తున్న మాట.మరోవైపు పలు గ్రామాల్లో వైసీపీ సానుభూతిపరులు సైతం ప్రతిపక్షం నుండి సరైన స్పందన లేకపోవడంతో, స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.*అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ లేదా?స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వైసీపీ తరపున ఎవరిని నిలబెడతారు? అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. జిల్లా నాయకత్వం నుండి కానీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నుండి కానీ ఎలాంటి పిలుపు రాకపోవడంతో, నియోజకవర్గంలో వైసీపీ ఉందా లేదా అనే సందేహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.*రాజకీయ పరిశీలకుల మాట!ఏ పార్టీకైనా స్థానిక సంస్థల ఎన్నికలే బలాన్ని నిరూపించుకునే వేదిక. అలాంటి కీలక సమయంలో ప్రతిపక్ష పార్టీ సైలెంట్ గా ఉండటం, ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం స్పందించి, కార్యకర్తల్లో భరోసా నింపకపోతే ఉదయగిరిలో పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.మొత్తానికి…ఒకవైపు అధికార పార్టీ ఎన్నికల శంఖారావం పూరించి దూసుకుపోతుంటే, మరోవైపు ప్రతిపక్షం నిద్రావస్థలో ఉండటం ఉదయగిరి రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లోనైనా వైసీపీ నేతలు మేల్కొంటారా? అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగుతారా? లేక ఇలాగే సైలెంట్ గా ఉంటారా? అనేది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *