డ్రైనేజీ సమస్యలకు చెక్…
గాంధీ విగ్రహం నుండి పద్మహాల్ వరకు డ్రైనేజీ కాలువలలో పూడికతీత పనులు..
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ రేణిగుంట సాధ్యం…
పారిశుధ్య అధికారుల పిలుపు..
రేణిగుంట (తిరుపతి జిల్లా):
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రేణిగుంట మండల పరిధిలోని రేణిగుంట పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ను వేగవంతం చేశారు.డిప్యూటీ ఎంపీడీవో ప్రభువు రావు, స్థానిక పంచాయతీ ఈవో శ్రీధర్ , లేబర్ మేస్త్రీ వెంకటేశ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పట్టణంలో పారిశుధ్య పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
గాంధీ విగ్రహం నుండి పద్మహాల్ వరకు కాలువల పూడికతీత
పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద నుండి పద్మహాల్ థియేటర్ వరకు డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన మట్టి, పూడిక, చెత్తాచెదారాన్ని పంచాయతీ కూలీలతో దగ్గరుండి తొలగింపజేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు కాలువలు పొంగిపొర్లకుండా నీరు స్వచ్ఛందంగా ప్రవహించి, రోడ్లమీద నిలవకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
డిప్యూటీ ఎంపీడీవో ప్రభువు రావు మాట్లాడుతూ:
”రేణిగుంట పంచాయతీలో పారిశుధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించి పనులను పూర్తీ చేస్తున్నాం.”
పంచాయతీ ఈవో శ్రీధర్ వర్మ మాట్లాడుతూ:
”నేను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పట్టణంలోని కాలువలు, డ్రైనేజీలు, చెత్త కుండీలపై ప్రత్యేక దృష్టి పెట్టాను. రోజూ ఉదయాన్నే పట్టణమంతా పర్యటించి పరిశీలన జరుపుతున్నాను. లేబర్ మేస్త్రీ మరియు పారిశుధ్య సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారు. డ్రైనేజీ పూడికతీతతో పాటు, వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు) సరిగ్గా వెలిగేలా దగ్గరుండి పనులు పూర్తి చేయిస్తున్నాం.”
పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి:
రహదారులపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు.
ఇళ్లలోని చెత్తను కేవలం చెత్తకుండీలలో మాత్రమే వేయాలి లేదా ప్రతిరోజూ ఇళ్ల ముందుకు వచ్చే పంచాయతీ చెత్త సేకరణ వాహనాలకే అందించాలి.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలందరూ పంచాయతీకి సహకరించి, పరిసరాల పరిశుభ్రతను పాటించాలిని తెలియజేశారు.

